క్షతగాత్రులను పరామర్శించనున్న చంద్రబాబు..! 12 h ago
AP: తిరుపతి ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డీజీపీ, టీటీడీ చైర్మన్‌తో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఉదయం 11 గంటలకు చంద్రబాబు తిరుపతికి వెళ్లనున్నారు. రుయా, స్విమ్స్‌లో క్షతగాత్రులతో పాటు బాధిత కుటుంబాలను చంద్రబాబు పరామర్శించనున్నారు. టీటీడీ ఈవోతో చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు.